Parliament Sessions | మణిపూర్ అంశం (Manipur violence) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon Session) కుదిపేస్తోంది. దీంతో ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi) ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాల (opposition) నిరసనలతో లోక్ సభ (Lok Sabha) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవగానే స్పీకర్ ఓం బిర్లా ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తవగానే మణిపూర్ హింసాత్మక ఘటనపై ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశాయి. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ వెల్ లోకి దూసుకెళ్లారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి తెలెత్తడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
మరోవైపు రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో మణిపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, విపక్షాలు సభలోని రూల్ 267 కింద మాత్రమే చర్చకు పట్టుబడటంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ‘మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో మణిపూర్ అంశాన్ని చర్చించాలని మేం కోరుకుంటున్నాం. కానీ విపక్షాలు అంగీకరించడంలేదు’ అని రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్ గోయల్ తెలిపారు.
Leader of the House in Rajya Sabha, Piyush Goyal says "We want discussions on Manipur to take place in Parliament today at 2 pm. They (Opposition) are trying to misuse the liberty given to the members. The govt is ready to discuss Manipur, but they (Opposition) have already… pic.twitter.com/3xAsmeIq8J
— ANI (@ANI) July 31, 2023
Also Read..
Zelensky | ఇప్పుడు యుద్ధం రష్యావైపు మళ్లింది : మాస్కోపై డ్రోన్ దాడి తర్వాత జెలెన్ స్కీ వ్యాఖ్య
Tomatoes | రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్..
MS Dhoni | ఫ్లైట్ లో ధోనీ నిద్రిస్తుండగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్.. మండిపడుతున్న ఫ్యాన్స్