Zelensky | ఇప్పుడు యుద్ధం రష్యావైపు మళ్లింది : మాస్కోపై డ్రోన్ దాడి తర్వాత జెలెన్ స్కీ వ్యాఖ్య
Zelensky | రష్యా (Russia) రాజధాని మాస్కో ( Moscow) నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ఆదివారం డ్రోన్లు విరుచుకుపడిన (Drone Strike) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ బలపడుతోందని.. ఇప్పుడు రష్యాకు యుద్ధం రాబోతోందని (War Returning To Russia) అన్నారు.
Zelensky | రష్యా (Russia) రాజధాని మాస్కో ( Moscow) నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ఆదివారం డ్రోన్లు విరుచుకుపడిన (Drone Strike) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ బలపడుతోందని.. ఇప్పుడు రష్యాకు యుద్ధం రాబోతోందని (War Returning To Russia) అన్నారు.
‘క్రమంగా యుద్ధం రష్యా భూభాగానికి తిరిగి వస్తోంది. ఆ దేశ ప్రతీకాత్మక కేంద్రాలు, సైనిక స్థావరాలకు వ్యాపిస్తోంది. ఇది అనివార్యమైన, సహజమైన, పూర్తి న్యాయమైన ప్రక్రియ’ అని ఉక్రెయిన్ నగరం ఇవానో ఫ్రాంకివ్స్కను సందర్శించిన సందర్భంగా జెలెన్ స్కీ పేర్కొన్నారు.
రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఉక్రెయిన్.. ఇప్పుడు ప్రత్యర్థి దేశంపై ఎదురు దాడికి దిగుతోంది. మాస్కోపై రివర్స్ అటాకింగ్ మొదలు పెట్టింది. ఇంతకాలం తమ దేశ భూభాగంపై అడుగు పెట్టడానికి యత్నించిన రష్యా సేనలను తిప్పికొడుతోంది. తగినన్ని ఆయుధాలు సమకూరడంతో వాటిని మాస్కోపై ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగా రాజధాని మాస్కోపై ఆదివారం డ్రోన్ల దాడి చేసింది. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది.
ఈ దాడిలో విమానాశ్రయానికి చెందిన రెండు భవనాలు దెబ్బతిన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ పలు డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. మొత్తం మూడు డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయని పేర్కొంది. దీనిని ఉగ్రదాడిగా మాస్కో అభివర్ణించింది. సరిహద్దుకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని మాస్కోపై డ్రోన్ దాడి జరగడం ఆ దేశ సైన్యాన్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది.
Also Read..
Tomatoes | రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్..
MS Dhoni | ఫ్లైట్ లో ధోనీ నిద్రిస్తుండగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్.. మండిపడుతున్న ఫ్యాన్స్
Skyscraper Climbs | 68వ అంతస్తు నుంచి పడి అధిరోహకుడి మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

