Skyscraper Climbs | 68వ అంతస్తు నుంచి పడి అధిరోహకుడి మృతి
Skyscraper Climbs | అత్యంత ఎత్తైన భవనాలను (Skyscraper Climbs) ఎంతో తేలికగా అధిరోహించే ఓ సాహసికుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.
Skyscraper Climbs | అత్యంత ఎత్తైన భవనాలను (Skyscraper Climbs) ఎంతో తేలికగా అధిరోహించే ఓ సాహసికుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాన్స్ (French)కు చెందిన 30 ఏళ్ల రెమీ లుసిడి (Remi Lucidi)కి ఎత్తైన భవనాలను ఎక్కడం వెన్నతో పెట్టిన విద్య. అలాంటి రెమీ తాజాగా ఓ కాంప్లెక్స్ ను అధిరోహించే క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. రెమీ లుసిడి హాంకాంగ్ (Hong Kong)లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ (Tregunter Tower complex)ను ఎక్కేందుకు ప్రయత్నించాడు. ముందుగా సోమవారం ఉదయం 6 గంటల సమయంలో భవనం సెక్యూరిటీ వద్దకు వెళ్లి.. 40వ అంతస్తులోని తన మిత్రుడిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి లోపలికి వెళ్లాడు. కానీ, 40వ అంతస్తులో సదరు వ్యక్తి.. లుసిడి ఎవరో తనకు తెలియదని చెప్పాడు. దీంతో సెక్యూరిటీ లుసిడిని ఆపేందుకు ప్రయత్నించగా.. అప్పటికే అతడు ఎలివేటర్ లో పైకి వెళ్లడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఉదయం 7.38 సమయంలో 68వ ఫ్లోర్ లోని పెంట్ హౌస్ కిటికీ బయట చిక్కుకుపోయాడు. దీంతో అతను భయంతో కిటికీని బలంగా తన్నాడు. ఈ క్రమంలో పట్టుకోల్పోయి అక్కడి నుంచి కాలు జారి కిందపడిపోయాడు. ఈ ఘటనలో లుసిడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలిలో లుసిడి కెమెరాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో లుసిడి ఎత్తైన విన్యాసాల వీడియోలు ఉన్నాయి.
Also Read..
Tomatoes | రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్..
Chandramukhi-2 Movie | చంద్రముఖి-2 ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్..!
Python | తిరుచ్చి ఎయిర్‌పోర్టులో 47 కొండచిలువలు స్వాధీనం.. ప్రయాణికుడు అరెస్ట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

