Tomatoes | రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్..
Tomatoes | టమాటా (Tomatoe)లు ప్రస్తుతం బంగారంతో సమానమైపోయాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకు కారణం భారీగా ధరలు పెరగడమే. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.200 పైనే పలుకుతోంది. ఇలాంటి సమయంలో రూ.21 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న ఓ లారీ మిస్సైంది.
Tomatoes | టమాటా (Tomatoe)లు ప్రస్తుతం బంగారంతో సమానమైపోయాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకు కారణం భారీగా ధరలు పెరగడమే. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.200 పైనే పలుకుతోంది. దీంతో సామాన్యులు కొనాలంటేనే జంకుతున్నారు. అయితే, టమాటా రైతులు మాత్రం కాసులు పోసుకుంటున్నారు. ఏకంగా రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతున్నారు. అదే సమయంలో చాలా చోట్ల టమాటాలను కొందరు దొంగతనం చేస్తున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రూ.21 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న ఓ లారీ మిస్సైంది.
ముగ్గురు వ్యాపారులు రూ.21లక్షల విలువైన 735 టమాటా బాక్సులను కొనుగోలు చేశారు. 15 కిలోల బరువున్న ఈ ఒక్కో టమాటా బాక్సును రూ.2 వేల నుంచి రూ.2,150కి కొనుగోలు చేశారు. వాటిని జులై 27వ తేదీన మధ్యాహ్నం సమయంలో లోడ్ చేసి.. రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని కోలార్ (Kolar) నుంచి జైపూర్ (Jaipur)కు తరలించారు. ఇందుకోసం ప్రైవేటు రవాణాను వినియోగించారు. లారీ డ్రైవర్ ఫోన్ నంబర్ ఇతర వివరాలను తీసుకున్నారు. ఈ ట్రక్కు శనివారం రాత్రి 11 గంటలకంతా జైపూర్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే కోలార్ నుంచి బయల్దేరిన తర్వాత శనివారం ఉదయం వరకూ వ్యాపారులతో టచ్ లో ఉన్న డ్రైవర్.. మధ్యాహ్నం తర్వాత ఆచూకీ లేకుండా పోయాడు. ట్రక్కుకు అమర్చిన జీపీఎస్ ట్రాకర్ (GPS tracker)లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన వ్యాపారులు వెంటనే కోలార్ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.
ట్రక్కుకు అమర్చిన జీపీఎస్ (GPS) సంబంధాలు తెగిపోవడానికి ముంది చివరి ప్రదేశం మహారాష్ట్రలోని నాసిక్ లో చూపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాసిక్ ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ కాగా, కోలార్ రెండవ అతిపెద్ద మార్కెట్ గా గుర్తింపు ఉంది. దీంతో డ్రైవర్ టమాటా లోడ్ ను దొంగిలించి నాసిక్ లో విక్రయించేందుకు తీసుకెళ్లి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read..
Manipur | మణిపూర్‌లో నగ్నంగా మహిళల ఊరేగింపు కేసు.. సుప్రీంకోర్టులో నేడు విచారణ
Python | తిరుచ్చి ఎయిర్‌పోర్టులో 47 కొండచిలువలు స్వాధీనం.. ప్రయాణికుడు అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

