Jaipur-Mumbai train | రైల్లో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి
Jaipur-Mumbai train | ముంబై : జైపూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ రైల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Jaipur-Mumbai train | ముంబై : జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్ రైల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. కోచ్ బీ5లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన పాల్ఘర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. జైపూర్ నుంచి ముంబైకి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో విధి నిర్వహణలో ఉన్న చేతన్ కుమార్ అనే కానిస్టేబుల్ తన వద్ద ఆటోమెటిక్ వెపన్తో ఏఎస్ఐ టికా రామ్ మీనాపై కాల్పులు జరిపాడు. అనంతరం మరో కోచ్‌లోకి వెళ్లి.. ముగ్గురి ప్రయాణికులపై తుపాకీతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ముగ్గురు ప్రయాణికులు కూడా ప్రాణాలు విడిచారు. ఏఎస్ఐ కూడా చనిపోయారు. దీంతో చేతన్ కుమార్ దహిసర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైలు దిగి పారిపోయేందుకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని మీరా రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చేతన్ వద్ద ఉన్న ఆటోమెటిక్ వెపన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది అనే విషయం తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

