Bihar Assembly Elections | బీహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పార్టీల్లో ఉత్సాహం పెరిగింది. ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో బిజీగా మారిపోయాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) సైతం గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను కమలం పార్టీ ఇవాళ రిలీజ్ చేసింది (BJP releases first list).
71 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు కూడా ఉన్నారు. సామ్రాట్ చౌదరి.. తారాపుర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలో దిగనున్నారు. వీరితోపాటూ రామ్ కృపాల్ యాదవ్, ప్రేమ్ కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్, అలోక్ రంజన్ ఝా, మంగళ్ పాండే వంటి పలువురు పార్టీ ముఖ్య నేతల పేర్లు కూడా ఫస్ట్ లిస్ట్‌లో ఉన్నాయి. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశ నవంబర్ 6, రెండో దశ నవంబర్ 11 తేదీల్లో జరగనున్నాయి. అదేనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 101 స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఎన్డీయే (NDA) కూటమి పార్టీల మధ్య ఇటీవలే సీట్ల సర్దుబాటు ఖరారైంది.
Also Read..
Sundar Pichai | విశాఖకు గూగుల్.. ఏఐ హబ్ విశేషాలను ప్రధానికి వివరించిన సుందర్ పిచాయ్