Sundar Pichai | టెక్ దిగ్గజం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. ఢిల్లీలోని మాన్సింగ్ హోటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతి పెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఫోన్లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్ (Google AI Hub in Vizag) విశేషాలను ప్రధానికి వివరించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఏఐ హబ్ ఓ కీలక మైలురాయిగా నిలువనుందని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ కంపెనీ రూ.88,628 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో వైజాగ్ ఏఐ సిటీగా మారనుంది. 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతి పెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. గూగుల్ క్లౌడ్, ఏఐ వర్క్స్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఈ డేటా సెంటర్‌ను వినియోగించనున్నారు. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Also Read..
Google Data Center | ఏఐ సిటీగా మారనున్న వైజాగ్.. డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో ఏపీ ఒప్పందం
Tirumala | తిరుమలలో కంపార్ట్మెంట్లు ఫుల్.. సర్వదర్శనానికి 12 గంటల సమయం