Chandrababu | ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో అడుగుపెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో హైదరాబాద్ హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని.. ప్రస్తుతం వైజాగ్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఢిల్లీలోని మాన్సింగ్ హోటల్లో ‘భారత్ ఏఐ శక్తి’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో గూగుల్ ఒప్పందం గొప్ప విజయమని తెలిపారు.
ఆనాడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చామని.. ఇప్పుడు వైజాగ్‌కు గూగుల్‌ను తీసుకొస్తున్నామని చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీలో నూతన ఇన్నోవేషన్స్ వస్తున్నాయని.. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్ టైమ్ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఇలాంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని తెలిపారు. దీనికోసం హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ అనే నినాదాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు.
తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ కంపెనీ రూ.88,628 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో వైజాగ్ ఏఐ సిటీగా మారనుంది. 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతి పెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. గూగుల్ క్లౌడ్, ఏఐ వర్క్స్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఈ డేటా సెంటర్‌ను వినియోగించనున్నారు. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
goog