పట్నా: బీహార్ మాజీ విద్యాశాఖ మంత్రి, అధికార జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరీ కరోనాతో కన్నుమూశారు. గతవారం కరోనాబారిన పడిన మేవాలాల్ పట్నాలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 4 గంటలకు మృతిచెందారు. ఆయన ప్రస్తుతం తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం తర్వాత సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో నెలరోజుల వ్యవధిలోనే మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు
మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి మృతిపట్ల సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రాజకీయాల్లో, విద్యారంగంలో ఆయన లేని లోటును పూడ్చలేమని విచారం వ్యక్తంచేశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పారు. ఈమేరకు సీఎం కార్యాలయ వర్గాలు ట్వీట్ చేశాయి.
CM Nitish Kumar (in file pic) condoles the demise of Mewalal Choudhary. CM says that his demise is saddening and an irreplaceable loss in the field of education and politics. His last rites will be performed with full state honours: Bihar Chief Minister's Office (CMO) pic.twitter.com/IKXIhfJtIy
— ANI (@ANI) April 19, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..