e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home అంతర్జాతీయం ఈజిప్టులో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 11 మంది మృతి

ఈజిప్టులో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 11 మంది మృతి

ఈజిప్టులో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 11 మంది మృతి

కైరో: ఈజిప్టులో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. ఈజిప్టులో రాజ‌ధాని కైరోకు ఉత్త‌రాన ఉన్న బ‌న్హాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మ‌రో వంద మందికిపైగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టారు. స్థానికుల స‌హాయంతో క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లిస్తున్నారు. కైరో నుంచి డెల్టాలోని మ‌న్సౌరాకు వెళ్తుండ‌గా టోక్ అనే ప‌ట్ట‌ణం వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు. మొత్తం నాలుగు బోగీలు ప‌ట్టాలు త‌ప్పిన‌ట్లు తెలిపారు. బోగీల్లో చిక్కకున్నవారిని బయటకు తీస్తున్నారు.

ఈజిప్టులో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 11 మంది మృతి
ఈజిప్టులో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 11 మంది మృతి


స‌హాయ‌క చ‌ర్య‌ల్లో 60కిపైగా అంబులెన్స్‌లు పాలుపంచుకున్నాయ‌ని చెప్పారు. గాయ‌ప‌డిన‌వారిలో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. చాలామందికి కాళ్లు, చేతులు విరిగాయ‌ని వెల్ల‌డించింది. రైలు ప్ర‌మాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, గత నెలల్లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృతి చెందగా, 165 మంది గాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

‘రెమ్‌డెసివిర్’‌ను దిగుమ‌తి చేసుకుంటాం.. అనుమ‌తివ్వండి
‘పింక్‌ వాట్సాప్‌’తో జాగ్రత్త!
మా కోసం ఏమీ చేయొద్దు.. మాస్క్‌లు ధరిస్తే చాలు..! ఓ వైద్యుడి భావోద్వేగం‌‌
వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచాలి
డేంజర్‌ బెల్స్‌
ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థికసాయం రేపటి నుంచి‌
వైరస్‌పై వజ్రాయుధం మాస్క్‌!
Advertisement
ఈజిప్టులో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 11 మంది మృతి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement