e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News మా కోసం ఏమీ చేయొద్దు.. మాస్క్‌లు ధరిస్తే చాలు..! ఓ వైద్యుడి భావోద్వేగం

మా కోసం ఏమీ చేయొద్దు.. మాస్క్‌లు ధరిస్తే చాలు..! ఓ వైద్యుడి భావోద్వేగం

మా కోసం ఏమీ చేయొద్దు.. మాస్క్‌లు ధరిస్తే చాలు..! ఓ వైద్యుడి భావోద్వేగం

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ మరోసారి బుసలు కొడుతుండటంతో.. ఓ వైద్యుడు ప్రజలకు ఇన్‌స్టాగ్రాం ద్వారా బహిరంగ విన్నపం చేశారు. ఈ విన్నపాన్ని చదివిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. రోగుల ప్రాణాలను కాపాడుతున్న మా కోసం మీరేమీ చేయవద్దు, కాని దయచేసి మాస్కులు ధరించండి అంటూ న్యూఢిల్లీకి చెందిన అనస్థీషియ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సాంధ్రా సెబాస్టియన్‌ ఇన్‌స్టాగ్రాంలో రాశారు. గత రెండు వారాలుగా అనుభవిస్తున్న అంశాలను పూసగుచ్చినట్లు అందించారు.

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ‘మీరు బయటకు వచ్చినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించండి’ అని ప్రజలను అభ్యర్థించారు. డాక్టర్ సాంధ్రా సెబాస్టియన్ తన పోస్ట్‌లో తాను పనిచేస్తున్న దవాఖాన వార్డు ఫొటోను పంచుకున్నారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆసుపత్రిలో కొవిడ్-19 రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు ప్రతిరోజూ ఎంతో వేధన భరించవలసి వస్తుందని తన పోస్ట్‌లో వివరించారు.

‘కరోనా వైరస్‌కు గురై శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న మహిళలు రాత్రంతా వేదనతో ఏడుస్తూ ఉంటున్నారు. వారు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు చిన్నారులకు అండగా ఉండాల్సిన తల్లి ఇలా కరోనా మహామ్మారి బారిన పడి జీవచ్ఛవంలా పడి ఉన్నది. మరోవైపు తమ చిన్నారుల ప్రాణాలను కాపాడమంటూ మోకాళ్లపై మాకు మోకరిల్లడం చూస్తే ఎంత బాధేసిందో మాటల్లో చెప్పలేను. ప్యాక్ చేసిన మృతదేహాలను చూస్తూ.. ఆలోచించడం మానేసి.. నా పనితో ముందుకు సాగాలని నాకు నేను చెప్పుకున్నాను. నేను చేయగలిగినంత కష్టపడి పనిచేస్తున్నాను. ఇతర ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరితే నా తల్లిదండ్రులు కూడా అదే చేస్తారని కోరుకుంటున్నాను’ అని డాక్టర్ సాంధ్రా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

డాక్టర్ సాంధ్రా సెబాస్టియన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్రేయా ధన్వంతరి, శ్రియా పిల్‌గావ్కర్ వంటి ప్రముఖులు కరోనా సమయంలో ఎలాంటి అలుపు సొలుపు లేకుండా సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

“మీరు అద్భుతమైన పని చేస్తున్నారు! ఎంతో శక్తివంతమైన సందేశం ఇది. మీ గురించి చాలా గర్వంగా ఉన్నది” అని ఒక ఇన్‌స్టాగ్రాం వినియోగదారు కామెంట్‌ పోస్ట్‌ చేశారు. మీ పోస్ట్‌ చదివి ఇకనైనా ప్రజల్లో మార్పు వస్తుందని, ముక్కుకు మాస్కులు ధరిస్తారని ఆశిస్తున్నాను అని మరోకరు కామెంట్‌ పెట్టారు.

ఇవి కూడా చదవండి..

సముద్రంలో విమానం అత్యవసర ల్యాండింగ్‌.. వీడియో వైరల్‌

పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది

57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!

త్వరలో కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే

ప్రిన్సిపాల్‌ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య

నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్‌ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్‌ మాండవీయ

కరోనా నివారణకు 8 మార్గాలు

రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్‌

పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మా కోసం ఏమీ చేయొద్దు.. మాస్క్‌లు ధరిస్తే చాలు..! ఓ వైద్యుడి భావోద్వేగం

ట్రెండింగ్‌

Advertisement