హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): సీబీఎస్ఈ 12వ తరగతి మారుల కేటాయింపులో చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, అవకతవకలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖనే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ఈ మారుల వ్యవహారంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా, అధికారంలో ఉన్న వారిని నిలదీస్తూ పోరాడుతున్న 12వ తరగతి విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. అన్యాయంపై వారు స్పందిస్తున్న తీరు, బాధ్యులను జవాబుదారీ చేస్తున్న విధానం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
‘2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళానికి కారణమై, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ‘గ్లోబరీనా’ సంస్థే ఈ సీబీఎస్ఈ మెస్ వెనుక కూడా ఉన్నది. ఆనా టి బ్లాక్లిస్ట్ సంస్థ కేవలం తన పేరు మార్చుకొని వచ్చి, సీబీఎస్ఈ నుంచి అంతకంటే పెద్ద కాంట్రాక్టును దకించుకున్నది. ఆ ఫలితంగా నే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంతకంటే పెద్ద గందరగోళాన్ని సృష్టించింది’ అని కేటీఆర్ మండిపడ్డారు.
‘ఆనాడు గ్లోబరీనా సంస్థ వల్ల ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లినప్పుడు బీఆర్ఎస్ ప్రభు త్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకున్నది. ము గ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారం గా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అ ధికారులను తొలగించడమే కాకుండా.. గ్లోబరీనా సంస్థను కోర్టుకు కూడా లాగాము’ అని కేటీఆర్ గుర్తుచేశారు. ఇంతటి బ్లాక్ హిస్టరీ ఉ న్న సంస్థను సీబీఎస్ఈ బోర్డు పూర్తిగా నమ్మ డం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
అత్యంత అసమర్థ సంస్థకు లబ్ధి చేకూర్చడం కోసమే సీబీఎస్ఈ బోర్డు పదేపదే తన నిబంధనలు మార్చి ఆ సంస్థకు భారీ కాంట్రాక్టు కట్టబెట్టినట్టు తనకు సమాచారం ఉన్నదని పేర్కొన్నారు. ఈ ఘోర తప్పిదానికి, గందరగోళానికి కేంద్రం సమాధానం చెప్పి తీరాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి దీనిపై దేశానికి జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు..