Crime news : విద్యార్థులకు విద్య నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే మానవ మృగాలలా ప్రవర్తించారు. ఓ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ (Blackmail) చేస్తూ ఇద్దరు లెక్చరర్లు (Lecturers) ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అదే కాలేజీలో పనిచేసే వారి స్నేహితుడు కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడు. కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో నరేంద్ర అనే వ్యక్తి ఫిజిక్స్ లెక్చరర్‌గా, సందీప్ బయాలజీ లెక్చరర్‌గా, అనూప్ నాన్‌టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. అదే కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని నరేంద్ర అకడమిక్ నోట్స్ షేరింగ్ పేరుతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అనూప్ ఇంటికి పిలిపించుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
నరేంద్ర విషయం బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసి కొన్ని రోజుల తర్వాత సందీప్ కూడా అత్యాచారం చేశాడు. ఆ ఇద్దరితో కలిసేందుకు తన రూమ్‌కు పలుమార్లు వచ్చిన సీసీ ఫుటేజ్ ఉందని బెదిరించి అనూప్ కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ముగ్గురూ ఆమెను బెదిరిస్తూ దఫాలుగా అఘాయిత్యానికి ఒడిగట్టారు.
చివరికి ఆ విద్యార్థిని తనను కలిసేందుకు కాలేజీకి వచ్చిన తల్లిదండ్రులతో విషయం చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించారు.