Nimisha Priya : కేరళ నర్సు (Kerala Nurse) నిమిష ప్రియ (Nimisha Priya) మరణశిక్ష (Execution) వాయిదా (Postpone) పడినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసింది. చివరి నిమిషంలో నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడిందని, నిమిష చేతిలో మరణించిన మహద్ కుటుంబాన్ని బ్లడ్ మనీ (Blood Money) తీసుకునేలా ఒప్పించడం కోసం భారత్‌కు చెందిన ఓ మత గురువు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా నిమిష ప్రియ యెమన్‌లో ఆ దేశానికి చెందిన మహద్ అనే వ్యక్తితో కలిసి వ్యాపారం చేసింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె తన పాస్‌పోర్టు కోసం అడిగింది. కానీ పాస్‌పోర్టు ఇచ్చేందుకు మహద్ నిరాకరించడంతో అతడికి మత్తుమందు ఇచ్చి తీసుకునేందుకు నిమిష ప్రయత్నించింది. అయితే డోస్ ఎక్కువ కావడంతో మహద్ మరణించాడు.
దాంతో యెమెన్ పోలీసులు నిమిషను హత్య కేసులో అరెస్ట్ చేశారు. ఆమె ముందుగా స్థానిక కోర్టు మరణశక్ష విధించింది. ఆ శిక్షను టాప్ కోర్టు సమర్థించింది. దాంతో ఈ నెల 16న నిమిషకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నిమిషకు శిక్ష తప్పించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించిన భారత ప్రభుత్వం.. ఇక తాను చేసేదేమీ లేదని సోమవారం చేతులెత్తేసింది. ఈ క్రమంలో నిమిష మరణశిక్ష వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.