GE-404 engine : అమెరికా (USA) నుంచి భారత్ (India) మరో GE-404 ఇంజిన్ను రిసీవ్ చేసుకుంది. ఇప్పటికే ఒక ఇంజిన్ను అందుకున్న భారత్.. ఇప్పుడు రెండో ఇంజిన్ను స్వీకరించింది. LCA Mark 1A ఫైటర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ కోసం భారత్.. అమెరికా నుంచి ఈ ఇంజిన్లను దిగుమతి చేసుకుంటోంది.
ఈ ఆర్థిక ఏడాది చివరికల్లా మొత్తం 12 GE-404 ఇంజిన్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉందని భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అంచనా వేస్తోంది. ఈ ఇంజిన్లను LCA Mark 1A ఫైటర్ జెట్లలో అమర్చనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. భారత వాయుసేన మొత్తం 83 LCA Mark 1A ఫైటర్ జెట్ల కోసం ఆర్డర్స్ ఇచ్చింది.
అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న మరో 97 LCA Mark 1A ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం కూడా భారత వాయుసేన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రక్షణశాఖ క్లియరెన్స్ రాగానే వాటి కోసం కూడా ఆర్డర్స్ ఇవ్వనుంది.