14 నుంచిటెన్త్ పబ్లిక్ పరీక్షలు
పదోతరగతి పబ్లిక్ (వార్షిక) పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లాలోని విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు పూర్తిచేశారు.
- కెమెరాల నిఘాలో ‘పది’ పరీక్షలు..
- ఉమ్మడి జిల్లా నుంచి 41,168 మంది విద్యార్థులు హాజరు
- నిర్ణీత సమయం కంటే 5నిమిషాలు ఆలస్యమైనా ఓకే
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
- 180 కేంద్రాల ఏర్పాటు l పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో హాల్‌టికెట్లు
- హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌తో పరీక్షా కేంద్రం చిరునామా
- విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో నమూనా ఓఎంఆర్, ఆన్సర్ బుక్లెట్
రామగిరి, మార్చి 11: పదోతరగతి పబ్లిక్ (వార్షిక) పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లాలోని విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు పూర్తిచేశారు. మరోవైపు ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ప్రశ్న ప్రతాలు, పరీక్షల నిర్వహణ తీరు పర్యవేక్షణకు, ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ గదిలోతో పాటు ఆవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిఘా నీడలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 41,168 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండటంతో 180 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సిబ్బందిని నియమించారు. విద్యార్థులు విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ట్లతో సైతం పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించగా, మరో వైపు హాల్‌టికెట్లపై ఈ పర్యాయం ఆయా పరీక్షా కేంద్రాల అడ్రస్సుతో క్యూ ఆర్ కోడ్ ముద్రించారు.
అదే విధంగా పరీక్ష రాసే విద్యార్థులు ఓఎంఆర్, ఆన్సర్బుక్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు విద్యాశాఖ వెబ్సైట్లో నమూనా అందుబాటులో ఉంచారు. అన్ని డీఈవో కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో వైపు విద్యార్థులు తమ హాల్‌టికెట్లను www.bse.telangana.gov.inలో డౌన్లోడ్ చేసుకుని (ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం లేనప్పటికీ) పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షలను నల్లగొండ డీఈవో బొల్లారం భిక్షపతి, సూర్యాపేటలో డీఈవో అశోక్, యాదాద్రి భువనగిరి జిల్లా డీఈవో కె.సత్యనారాయణ పర్యవేక్షిస్తారు.
కెమెరాలు, ఫ్లయింగ్ స్కాడ్ నియామకం
పరీక్షల నిర్వహణలో భాగంగా ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 180 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ గదితోపాటు పరీక్షా కేంద్రంలో ఆవరణ కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభమైన సమయం నుంచి ముగిసే వరకు రికార్డు చేసిన సీసీ పుటేజీని ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ చివరి రోజు సీల్డ్ కవర్లో భద్రపర్చి ఆయా జిల్లాలోని డీఈవోలకు సమర్పించాలి. అలాగే పరీక్షల పర్యవేక్షణకు నల్లగొండ జిల్లాలో 6, సూర్యాపేట జిల్లాలో 4, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరే కాకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్కాడ్ ఉంటారు.
పరీక్షల నిర్వహణకై హెల్ప్ డెస్క్‌లు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణకై ఆయా జిల్లాలోని డీఈవో కార్యాలయంలో 24 గం. పనిచేసేలా హెల్ప్‌డెస్క్‌లు(కంట్రోల్ రూమ్స్) ఏర్పాటు చేశారు. వీటిలో ప్రత్యేక ఫోన్ నెంబర్స్ అందుబాటులో ఉంచారు.అన్ని ఏర్పాట్లు చేశాం..పరీక్షల నిర్వహణకు కలెక్టర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలమేరకు సీసీ కెమెరాలతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.పరీక్షా సమయం కంటే ఒక గంట ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలతోపాటు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీ చేస్తారు. పరీక్షల నిర్వహణ, ఇతర అంశాలపై ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉండేలా డీఈవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేలా ఏర్పాట్లు చేశాం.
-బొల్లారం భిక్షపతి, డీఈవో, నల్లగొండ
విద్యార్థులు పాటించాల్సిన సూచనలు
- పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా (ఉ 8.30) చేరుకోవాలి.
- ఉదయం 9.35 తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు.
- సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- విద్యార్థులు కేవలం పరీక్ష ప్యాడ్, హాల్‌టికెట్, పెన్ను, పెన్సిల్ మాత్రమే తీసుకెళ్లాలి.
- ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హల్ టికెట్లను అనుమతిస్తారు.
- పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, తాగునీరు.
- అన్ని కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుంది.
సిబ్బంది పాటించాల్సిన నిబంభనలు
- పరీక్షా కేంద్రంలో ఉన్న సీఎస్, డీవో,ఇతర ఇబ్బంది ఎవరికీ సెల్‌ఫోన్‌న్లు పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లే అనుమతి లేదు.
- పరీక్షల సిబ్బంది విధిగా ఐడీ కార్డు ఉండాలి.
- సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు.
- చీఫ్ సూపరింటెండెంట్,డిపార్టుమెంటల్ అధికారులు పాఠశాల విద్యాశాఖ సూచనలు పాటించాలి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

