vivo X Fold5 | ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లకు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే కంపెనీలు కూడా ఈ తరహా ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో పోటీ పడుతున్నాయి. అదే కోవలో వివో కూడా ఓ నూతన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎక్స్ ఫోల్డ్ 5 పేరిట ఓ మడతబెట్టే ఫోన్‌ను లేటెస్ట్ గా లాంచ్ చేశారు. ఇందులో 8.03 ఇంచుల 2కె ప్లస్ ఎల్టీపీవో డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక సూర్యకాంతిలోనూ స్సష్టంగా వీక్షించేలా ఈ ఫోన్ పీక్ బ్రైట్ నెస్‌ను 4500 నిట్స్ వరకు అందిస్తుండడం విశేషం. కవర్ డిస్ప్లే 6.53 ఇంచులుగా ఉంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది కూడా ఎల్టీపీవో డిస్ప్లే కావడం విశేషం. దీనికి కూడా 4500 నిట్స్ బ్రైట్ నెస్ లభిస్తుంది.
ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా గ్రాఫైట్ హీట్ టెక్నాలజీని అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినా అంత త్వరగా వేడి కాదు. ఈ ఫోన్‌కు గాను ఐపీఎక్స్8, ఎక్స్9 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఐపీ5ఎక్స్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. -20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలోనూ పనిచేసే విధంగా ఫోన్‌ను తీర్చిదిద్దారు. 6 లక్షల సార్లు మడతబెట్టినా కూడా మన్నికగా ఉండేలా ఈ ఫోన్‌ను తీర్చిదిద్దారు. ఈ ఫోన్‌ను మడతబెట్టినప్పుడు 9.2 ఎంఎం మందాన్ని, మడత తీసినప్పుడు 4.3 ఎంఎం మందాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బరువు 217 గ్రాములుగా ఉంది.
ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా, 50 మెగాపిక్సల్ 3ఎక్స్ టెలిఫొటో కెమెరాను అమర్చారు. మరో 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌కు ఒక షార్ట్ కట్ బటన్‌ను ఇచ్చారు. దీని సహాయంతో యూజర్ తనకు కావల్సిన యాప్స్ లేదా టూల్స్‌ను చాలా వేగంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. 16జీబీ ర్యామ్ లభిస్తుంది. 512జీబీ స్టోరేజ్‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్లో ఉన్న బ్యాటరీకి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 40 వాట్ల వైర్లెస్ చార్జింగ్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్‌ను టైటానియం గ్రే కలర్ ఆప్షన్లో మాత్రమే లాంచ్ చేశారు. ఈ ఫోన్ కు చెందిన సింగిల్ వేరియెంట్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,49,999గా ఉంది. ఈ ఫోన్‌ను వివో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్ కార్ట్‌లో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. జూలై 30వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయిస్తారు. దీనికి గాను ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించారు. జీరో డౌన్ పేమెంట్‌తో ఈ ఫోన్‌ను 24 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ విధానంలో కొనుగోలు చేసే సౌలభ్యాన్ని అందిస్తున్నారు. నెలకు రూ.6250 ఈఎంఐ అవుతుంది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ, డీబీఎస్, హెచ్ఎస్బీసీ, యెస్ బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్‌ను అందిస్తారు.