హైదరాబాద్ : కంకర లోడ్‌తో వెళ్తున్న లారీలో(Lorry )ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాద్‌నగర్ నుంచి షాబాద్ వైపు వెళ్తున్న లారీ అంతారం గేట్ సమీపానికి చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి.
డ్రైవర్ వెంటనే లారీని రోడ్డుకి పక్కన ఆపి సురక్షితంగా వాహనం నుండి బయటకు దిగాడు. ఫైర్ ఇంజన్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.