President Murmu: ప్రచండ్ హెలికాప్టర్లో విహరించిన రాష్ట్రపతి ముర్ము
President Murmu: ప్రచండ్ హెలికాప్టర్లో ఇవాళ రాష్ట్రపతి ముర్ము విహరించారు. జైసల్మేర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్నది. సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో ముర్ము విహరించారు. స్వయం సమృద్ధికి శక్తివంతమైన సంకేతంగా ప్రచండ హెలికాప్టర్ నిలుస్తుందన్నారు.
జైసల్మేర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Murmu) ఇవాళ లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో విహరించారు. సుమారు 25 నిమిషాల పాటు ఆమె సోర్టీ నిర్వహించారు. భారత్, పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న జైసల్మేర్ జిల్లాలో ముర్ము విహరించారు. జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్నది. టేకాఫ్‌కు ముందు ఆ హెలికాప్టర్ గురించి రాష్ట్రపతి ముర్ముకు కెప్టెన్ బ్రీఫింగ్ ఇచ్చారు. కాక్‌పిట్ నుంచి ఆమె చేతులు ఊపారు. సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో ముర్ము విహరించారు.
స్వయం సమృద్ధికి శక్తివంతమైన సంకేతంగా ప్రచండ హెలికాప్టర్ నిలుస్తుందని, జైసల్మేర్ జిల్లాలో విహరిస్తున్నానని, మన విరోచిత సైనికులకు హృదయపూర్వక గ్రీటింగ్స్ చెబుతున్నానని ముర్ము ఆ హెలికాప్టర్ కాక్‌పిట్ నుంచి సందేశం వినిపించారు. సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని, జై హింద్, జై భారత్ అని ఆమె అన్నారు. పోక్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఇక్కడే ఇవాళ సాయంత్రం వాయు శక్తి పేరుతో విన్యాసాలు నిర్వహించనున్నారు.
ఇవాళ్టి సోర్టీతో యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించి తొలి భారత రాష్ట్రపతిగా ముర్ము రికార్డు క్రియేట్ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆమె అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన విషయం తెలిసిందే. 2023 ఏప్రిల్‌లో ఆమె సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ ప్లేన్‌లో ఎగిరారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఎల్సీహెచ్ ప్రచండ హెలికాప్టర్‌ను నిర్మించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేశారు. అడ్వాన్స్డ్ ఏవియానిక్స్, స్టీల్త్ ఫీచర్స్, నైట్ అటాక్ కెపాసిటీ, ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ తీసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉన్నది.
President Droupadi Murmu undertook a sortie in the indigenous Light Combat Helicopter Prachand at Air Force Station Jaisalmer, Rajasthan. The President said that we are extremely proud of our country’s brave air warriors. She described LCH Prachand as a powerful symbol of… pic.twitter.com/AbtCgBkLWi
— President of India (@rashtrapatibhvn) February 27, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

