Ayodhya | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ( Maha Kumbh) కొనసాగుతోంది. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మహాకుంభమేళా వేళ యూపీలోని ప్రఖ్యాత ప్రదేశం అయోధ్యకు కూడా భక్తులు (Devotees) పోటెత్తుతున్నారు. అయోధ్య రామ మందిరాన్ని (Ram temple) సందర్శిస్తున్నారు.
#WATCH | Ayodhya, UP | Devotees throng Shri Ram Janmbhoomi temple in Ayodhya to offer prayers. pic.twitter.com/STWZUaYwyb
— ANI (@ANI) January 28, 2025
ముఖ్యంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున అయోధ్యలోని రామ మందిరాన్ని 25 లక్షల మందికిపైగా భక్తులు సందర్శించినట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. భక్తులు రామ్ లల్లాతోపాటు హనుమాన్‌గర్హి ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వస్తున్న భక్తులు అటునుంచి అయోధ్యకు వస్తున్నట్లు తెలిపింది. కాగా, భక్తుల రాకతో అయోధ్యా నగరి రద్దీగా మారింది. మరోవైపు రానున్న రోజుల్లో అయోధ్యకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా రామ మందిరం, హనుమాన్ గర్హి ఆలయాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించింది.
15 కోట్ల మంది పుణ్య స్నానాలు
త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది మహాకుంభ్‌లో అమృత స్నానాలు చేశారు. అయితే రేపు మౌనీ అమావాస్య(Mauni Amavasya) సందర్భంగా .. కుంభమేళాకు ఒక్క రోజే సుమారు పది కోట్ల మందికిపైగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. గడిచిన 17 రోజుల్లో ప్రతి రోజూ సుమారు కోటి మంది వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. బుధవారం మౌనీ అమావాస్య కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
Also Read..
Mauni Amavasya: రేపే మౌనీ అమావాస్య.. ఒక్క రోజే కుంభమేళాలో 10 కోట్ల మంది పుణ్య స్నానాలు
Gurmeet Ram Rahim: 30 రోజుల పెరోల్‌పై రిలీజైన గుర్మీత్ రామ్ రహీమ్
Infosys | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు