Mauni Amavasya: రేపే మౌనీ అమావాస్య.. ఒక్క రోజే కుంభమేళాలో 10 కోట్ల మంది పుణ్య స్నానాలు
Mauni Amavasya : రేపు మౌనీ అమావాస్య సందర్భంగా.. ఒక్క రోజే సుమారు పది కోట్ల మంది కుంభమేళాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో 15 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు.
ప్రయాగ్‌రాజ్: త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది మహాకుంభ్‌లో అమృత స్నానాలు చేశారు. అయితే రేపు మౌనీ అమావాస్య(Mauni Amavasya) సందర్భంగా .. కుంభమేళాకు ఒక్క రోజే సుమారు పది కోట్ల మందికిపైగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. గడిచిన 17 రోజుల్లో ప్రతి రోజూ సుమారు కోటి మంది వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. బుధవారం మౌనీ అమావాస్య కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను అమర్చారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. సంగంకు వెళ్లే స్థానికులు ఫోర్ వీలర్లను కాకుండా, టూ వీలర్లను వాడాలని ప్రభుత్వం సూచించింది.
మౌనీ అమావాస్య ప్రత్యేకతేంటి..
మౌనీ అమావాస్య రోజున నదీ స్నానం విశేషమైంది. మహాకుంభమేళాలో అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6.45 నిమిషాలకు .. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించే భక్తులపై పూలవర్షం కురిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. షాహి స్నానం నిర్వహించే తేదీల్లో.. నాగ సాధువులు, అకాడాలు భారీ ర్యాలీగా నదీ తీరానికి చేరుకుంటారు. అమృత స్నాన దినాల్లో అదే ఆకర్షణీయమైంది. అయితే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి.. ఒకే రేఖలోకి రావడం వల్ల.. పవిత్ర నదుల ఆధ్యాత్మిక శక్తి మరింత దిగ్విణీకృతం అవుతుందని భావిస్తారు.
హిందూ క్యాలెండర్‌లోని మాఘ కృష్ణ అమావాస్య రోజున.. మౌనీ అమావాస్య వస్తుంది. అమృత స్నాన దినాల్లో.. మౌనీ అమావాస్య స్నానమే ప్రత్యేకమైందిగా భావిస్తారు. ఈ రోజున పవిత్ర నదీ జలం అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మౌనీ అమావాస్యను సాధువులు స్నానం చేసే రోజు అని కూడా పేర్కొంటారు. సాంప్రదాయకర రీతిలో మౌనంగా మౌనీ అమావాస్య రోజున స్నానాన్ని ఆచరిస్తారు. జనవరి 28, 29, 30 తేదీల్లో ప్రయాగ్‌రాజ్‌లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

