Infosys | ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ (Senapathy Kris Gopalakrishnan) పై ఎస్సీ, ఎస్టీ అల్ట్రాసిటీ యాక్ట్ (SC-ST Atrocities Act) కింద కేసు నమోదైంది. ఆయనతోపాటు మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాంతో, మరో 16 మందిపై బెంగళూరు (Bengaluru)లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
2014లో వీరంతా ఓ హనీ ట్రాప్ కేసులో తప్పుగా ఇరికించారని, అంతేకాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫ్యాకల్టీ విధుల నుంచి తనను తొలగించారంటూ మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కులం పేరుతో తనను దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో (Sadashivnagar police station) కేసు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Donald Trump: ఫిబ్రవరిలో వైట్‌హౌజ్‌కు మోదీ: డోనాల్డ్ ట్రంప్
ISRO | రేపు ఇస్రో వందో ప్రయోగం.. జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 కౌంట్‌డౌన్ షురూ
HFEA | కృత్రిమ వీర్యం.. నచ్చిన రూపం.. ఆ అవసరం లేకుండానే సంతానం!