ISRO | భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకోవడానికి ఇస్రో (ISRO) సర్వం సిద్ధంచేసింది. ఈ నెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15) రాకెట్‌ను రోదసిలోకి పంపనుంది. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను మంగళవారం తెల్లవారుజామున 2.53 గంటలకు ప్రారంభించింది. 27 గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగనుంది. అంటే బుధవారం ఉదయం 6.23 గంటలకు షార్‌లోని రెండో ల్యాంచ్ఫ్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ జీఎస్ఎల్వీ సిరీస్‌లో 17వది, దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ కలిగిన 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది. ఈ ఉపగ్రహం సెకండ్ జెనరేషన్ శాటిలైట్ కాగా.. ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. ఇది ఎన్వీఎస్-02 ఉపగ్రహం ఎన్వీఎస్ సిరీస్‌లో రెండో ఉపగ్రహం. ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్లను.. అలాగే తొలితరం ఉపగ్రహం ఎన్వీఎస్-01లో ఉన్నట్లుగానే సీబ్యాండ్లో రేజింగ్ పేలోడ్స్ ఉంటాయి. నావిక్ (NavIC) అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ.
భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం దీని ఉద్దేశం. కొత్త శాటిలైట్‌తో దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్లో రూపొందించగా.. ఇతర శాటిలైట్ సెంటర్లు సహకారం అందించాయి. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ జీఎస్ఎల్వీ సిరీస్‌లో 17వది కావడం విశేషం. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ కలిగిన 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ఇస్రో ప్రవేశపెడుతుంది.
🌌 Standing tall and ready for the skies! Here’s the mighty GSLV-F15 all set to launch the NVS-02 satellite.
⏰ Date: 29th January 2025 | Time: 6:23 Hours (IST)
📺 Watch the launch live: https://t.co/fKfRXdzl6E (from 05:50 hours)Stay inspired! 🚀
More information at:… pic.twitter.com/G4CJZnAjgB
— ISRO (@isro) January 27, 2025