చండీఘడ్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(Gurmeet Ram Rahim).. హర్యానాలోని రోహతక్ జైలు నుంచి రిలీజయ్యాడు. అతనికి 30 రోజుల పెరోల్ మంజూరీ చేశారు. సిర్సాలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయానికి ఆయన వెళ్లిపోయారు. రోహతక్‌లోని సునరియా జైలులో గుర్మీత్ శిక్ష అనుభవిస్తున్నారు. రేప్ కేసులో నిందితుడైన గుర్మీత్ 2017లో జైలుకు వెళ్లాడు. అయితే జైలు నుంచి బయటకు వచ్చి.. సిర్సాలోని కార్యాలయానికి ఆయన మొదటిసారి వెళ్లారు. గతంలో పేరోల్ తీసుకున్నప్పుడు అతను యూపీలోని భాగ్పాత్లో ఉన్న ఆశ్రమంలో ఉండేవారు.
ఈసారి 10 రోజులు సిర్సాలో ఆ తర్వాత మిగితా రోజులన్నీ భాగ్పాత్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. డేరాను విజిట్ చేయరాదు అని ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇద్దరు భక్తుల్ని రేప్ చేసిన కేసులో గుర్మీత్ 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయనకు 20 రోజుల పాటు పెరోల్ ఇచ్చారు. అప్పుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు పెరోల్ ఇవ్వగా, ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు పెరోల్ మంజూరీ చేశారు.