బుధవారం 03 జూన్ 2020
National - May 19, 2020 , 10:35:00

బీహార్‌లో ఘోర ప్రమాదం : 9 మంది వలస కార్మికులు మృతి

బీహార్‌లో ఘోర ప్రమాదం : 9 మంది వలస కార్మికులు మృతి

పాట్నా : భాగల్‌పూర్‌లోని నౌగచ్చియా వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు - బస్సు ఢీకొనడంతో 9 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వలస కూలీలు ట్రక్కులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. 


logo