Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy), ఆయన భార్య, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి (Sudha Murty) సైతం బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణమూర్తి ఆసుపత్రి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.
ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ‘ప్రతి ఐదేళ్లకు ఒకసారి మనం ఈ ఓటు హక్కును పొందుతాము. ఎంతో ఆలోచించి బాధ్యతాయుతంగా ఈ హక్కును వినియోగించుకోవాలని. ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు’ అని ఓటర్లకు సూచించారు.
#WATCH | Karnataka: Infosys founder Narayana Murthy casts his vote at BES polling station in Bengaluru.
Karnataka is voting on 14 seats today in the second phase of Lok Sabha elections.#LokSabhaElections2024 pic.twitter.com/Pv81ktRzte
— ANI (@ANI) April 26, 2024
77 ఏళ్ల నారాయణమూర్తి అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఓటు వేసేందుకు ఆసుపత్రి నుంచి నేరుగా వచ్చారని ఆయన భార్య, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి తెలిపారు. ‘నారాయణమూర్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఇవాళ డిశ్చార్జ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఓటు వేసిన తర్వాత ఆయన్ని ఇంటికి తీసుకెళ్తాము’ అని సుధామూర్తి తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
కాగా, ఈ దశలో 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో కర్ణాటకలో 14 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఇక మొత్తం 13 రాష్ట్రాల్లో కలిపి 1,206 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు మ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. వీరికోసం 1.67 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
Also Read..
Lok Sabha Pols | త్రిపురలో 36.42 శాతం.. మహారాష్ట్రలో 18.83 శాతం.. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం ఇలా
Sudha Murty | ఓటేయండి.. మీ నాయకుడిని ఎన్నుకోండి.. ఓటర్లకు సుధామూర్తి పిలుపు
Google Doodle | రెండో విడత పోలింగ్.. గూగుల్ ప్రత్యేక డూడుల్ చూశారా..?