Smriti Irani : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ (AAP) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ పార్టీ మళ్లీ ఢిల్లీలో గద్దెనెక్కబోతోంది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఎన్నికల ఫలితాలపై స్పందించారు. చెప్పింది చేయడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారని ఆమె విమర్శించారు.
‘అర్వింద్ కేజ్రీవాల్ ఆనాడు భారత రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకురావడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. కానీ నాడు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా ఆయన ఎలాంటి మార్పు తేలేకపోయారు. పైగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆయన నిందితుడు అయ్యారు. ఆయన ఢిల్లీలో బీజేపీ చేసిన అభివృద్ధిని తన అభివృద్ధిగా చెప్పుకున్నారు. అయినా ప్రజలు ఆయన మాటలను నమ్మలేదు.’ అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.
అదేవిధంగా ఢిల్లీలో బీజేపీకి ఘన విజయం కట్టబెట్టిన ఓటర్లకు స్మృతి ఇరానీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేగాక ప్రధాని మోదీ నాయకత్వంపైన, సుపరిపాలనపైన విశ్వాసం ఉంచి, విజయాన్ని కట్టబెట్టినందుకు ఢిల్లీ ప్రజలను ఆమె అభినందించారు. ‘బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రధాని మోదీ నాయకత్వంపైన, సుపరిపాలనపైన నమ్మకం పెట్టుకుని ఓటువేసినందుకు వారిని అభినందిస్తున్నా.’ అని స్మృతి ఇరానీ చెప్పారు.
Arvind Kejriwal | ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. బీజేపీకి అభినందనలు : అర్వింద్ కేజ్రీవాల్
Delhi Elections | సీఎం అతిషి విజయం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పరాజయం
Delhi Elections | ఘోర పరాజయం పాలైన ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్
Delhli Elections | జంగ్‌పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి
Road Accident | దంపతులను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. భార్య మృతి, భర్తకు గాయాలు
Panchayati Elections | ఆ ఏడు పంచాయతీలు ఎటు.. సుజాత నగర్‌కు మినహాయింపు లేదా?
Arvind Kejriwal | వెనుకంజలోనే కేజ్రీవాల్.. ఓటమి దిశగా ఆప్