Anupam Kher : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) పై బాలీవుడ్ నటుడు (Bollywood actor) అనుపమ్‌ఖేర్ (Anupam Kher) స్పందించారు. ఉగ్రదాడి జరిగిన రోజు భర్త మృతదేహం దగ్గర కూర్చుని రోదిస్తున్న నవ వధువును చూసి తాను చలించిపోయానని ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారని అన్నారు. గతంలో కూడా ఎన్నో దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్లో 1990 జనవరి 19న కశ్మీరీ పండితులు తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని బాధపడ్డారు.
ఇటీవల కాలంలో ఎంతో మంది కశ్మీర్‌కు వెళ్లడం ప్రారంభించారని, ఈ క్రమంలో పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి దారుణమని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. దాడి జరిగిన రోజు తన భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న నవ వధువు పరిస్థితి చూసి తాను చలించిపోయానని అన్నారు. ఈ ఉగ్రదాడిపై జాతి మొత్తం ఆగ్రహం వ్యక్తంచేసిందని గుర్తుచేశారు.