Bihar CM : బీహార్ (Bihar) లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. దాంతో ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహ్తాస్ జిల్లా (Rohtas district) లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం (NDA govt) భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా హాజరయ్యారు.
సభలో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మన ప్రధాని వాజ్పేయి..’ అని వ్యాఖ్యానించారు. దాంతో అందరూ ఆశ్యర్యపోయారు. ఆ వెంటనే పొరపాటును గ్రహించిన నితీశ్ కుమార్.. ‘సారీ.. ఆయన ఇంతకుముందు సేవలందించారు’ అని సవరించుకున్నారు. దాంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.
ఆ తర్వాత నితీశ్ కుమార్ ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. బీహార్లో కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్త కులగణన చేపట్టాలని ప్రధాని నిర్ణయించడం ఒక ‘చారిత్రక అడుగు’ అని పొగిడారు. అందుకు ప్రధాని నరేంద్రమోదీకి నిలబడి ధన్యవాదాలు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.