Covid-19 | ఇన్ని రోజులూ శాంతించిన కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లోనూ కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ వైరస్ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో సుమారు వెయ్యి మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా.. తాజా కేసులతో కలిపి ఆ సంఖ్య 2,710కి పెరిగింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,147 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తర్వాత మహారాష్ట్రలో 424 కేసులు, ఢిల్లీలో 294, గుజరాత్లో 223, కర్ణాటకలో 148, తమిళనాడులో 148, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదైనట్లు వివరించింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణలో 3 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
కాగా, మే 25తో ముగిసిన వారంలో ఇన్ఫెక్షన్లు ఐదు రెట్లు పెరిగి 1,000 మార్క్‌ను దాటినట్లు వెల్లడించింది. మరోవైపు వైరస్ వ్యాప్తితోపాటు మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఏడు మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో రెండు మరణాలు సంభవించగా, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదయ్యాయి.
Also Read..
Taj Mahal: తాజ్‌మహల్‌కు ప్రత్యేక రక్షణ.. యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్న కొలంబియా
US Citizenship | నైతిక ప్రవర్తన బాగుంటేనే.. పౌరసత్వంపై అమెరికా కొత్త మెలిక