న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) గురించి ప్రపంచ దేశాలకు భారతీయ ఎంపీలు వివరిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని మన ఎంపీలు వివిధ దేశాలకు తెలియజేస్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కొలంబియా దేశం పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది. పాక్ పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. ఆ దేశం వెళ్లిన శశిథరూర్ నేతృత్వంలోని బృందం దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కొలంబియా వైఖరి పట్ల ఇండియాన తన విముఖతను వ్యక్తం చేయడంతో ఆ దేశం దిగివచ్చింది. దక్షిణ అమెరికా దేశం తన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకున్నది.
కొలంబియా రాజధాని బొగొటలో జరిగిన కార్యక్రంలో ఎంపీ శశిథరర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో మృతి చెందిన వారి పట్ల సంతాపం తెలిపిన కొలంబియా వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఇండియా అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పెహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు పట్ల కొలంబియా తన విచారాన్ని వ్యక్తం చేయలేకపోయిందన్నారు. పాక్ అనుకూల స్టేట్మెంట్ను కొలంబియా వెనక్కి తీసుకుంటుందని, ఆ తర్వాత భారత్‌కు మద్దతుగా స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. బొగోటలో ఉన్న తాడియో లొజానో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో శశిథరూర్ ఆ వ్యాఖ్యలు చేశారు. అక్కడ మహాత్మా గాంధీకి ఆయన నివాళి అర్పించారు.
Read More..