Neha Bhandari: బీఎస్ఎఫ్ మహిళా ఆఫీసర్ నేహా భండారిని సత్కరించిన ఆర్మీ చీఫ్
Neha Bhandari: బీఎస్ఎఫ్ మహిళా ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ నేహ భండారీని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సత్కరించారు. కమెండేషన్ డిస్క్‌తో ఆమెను సన్మానించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆక్నూర్ సెక్టార్ వద్ద.. పాక్ ఫార్వర్డ్ దళాలను ఆమె బృందం అడ్డుకున్నది.
జమ్మూ: ఆపరేషన్ సింధూర్ సమయంలో బీఎస్ఎఫ్ దళాలు .. పాకిస్థాన్ బలగాలను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అయితే బీఎస్ఎఫ్ మహిళా ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ నేహ భండారీ(Neha Bhandari) నేతృత్వంలోని మహిళా దళం కూడా అసాధారణ సత్తాను చాటింది. ఈ నేపథ్యంలో నేహ భండారిని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సత్కరించారు. కమెండేషన్ డిస్క్‌తో ఆమెను సన్మానించారు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆమెను కీర్తించారు. జమ్మూలోని ఆక్నూర్ సెక్టార్ వద్ద.. పాక్ ఫార్వర్డ్ దళాలను ఆమె బృందం అడ్డుకున్నది.
అంతర్జాతీయ బోర్డర్ వద్ద ఉన్న పాకిస్థానీ పోస్టుపై చాకచక్యంగా నేహ భండారి బృందం ఎదుర్కొన్నది. జీరో లైన్ వద్ద సుమారు మూడు ఫార్వర్డ్ పోస్టులను ఆ దళం తిప్పికొట్టింది. నేహను సత్కరించిన అంశంపై బీఎస్ఎఫ్ జమ్మూకు చెందిన ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టారు. చాలా విపత్కరమైన పరిస్థితుల్లో నేహ తన టీమ్‌ను లీడ్ చేసినట్లు తెలిపారు. నేహతో పాటు మరో ఆరు మంది మహిళా కానిస్టేబుళ్లు ఫార్వర్డ్ పోస్టుల వద్ద గన్ పొజిషన్లో ధీటుగా బదులిచ్చారు. సాంబా, ఆర్ఎస్ పురా, ఆక్నూర్ సెక్టార్ల వద్ద శత్రువులను ఎదుర్కొన్నారు.
నేహ భండారి స్వరాష్ట్రం ఉత్తరాఖండ్. నేహ కుటుంబం ఆర్మీలో ఉన్నది. ఆమె మూడవ తరం ఆఫీసర్ కావడం వివేషం. బీఎస్ఎఫ్లో విధులు నిర్వర్తించడాన్ని గర్వంగా భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆక్నూర్ సెక్టార్‌లోని పర్గ్వాల్ ఫార్వర్డ్ ఏరియాను ఆమె కమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద దళాలతో నిఘా నిర్వహించడం పట్ల గర్వంగా ఉందని, ఆక్నూరు పోస్టుకు 150 మీటర్ల దూరంలో పాకిస్థానీ పోస్టు ఉన్నట్లు ఆమె తెలిపారు.
నేహ భండారి తాతయ్య ఇండియన్ ఆర్మీలో చేశారు. ఆమె పేరంట్స్ ఇద్దరూ సీఆర్పీఎఫ్లో విధులు నిర్వర్తించారు.
On 30 May 2025, COAS General Upendra Dwivedi, PVSM, AVSM, felicitated Assistant Commandant Neha Bhandari of BSF Jammu with the Commendation Disc for her exceptional courage and operational proficiency during Operation Sindoor. She gallantly commanded a forward deployed BSF… pic.twitter.com/6PDPfTZzQB
— BSF JAMMU (@bsf_jammu) May 30, 2025
Read More..
తాజ్‌మహల్‌కు ప్రత్యేక రక్షణ.. యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు
ఆపరేషన్ సింధూర్.. స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్న కొలంబియా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

