Nigeria floods | ఆఫ్రికా దేశం నైజీరియా (Nigeria)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలు (floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఈ వర్షాలకు ఓ డ్యామ్ కూలిపోయింది. ఈ వరదలకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
భారీ వర్షాలకు సెంట్రల్ నైజీరియాలోని మోక్వా (Mokwa) పట్టణానికి సమీపంలోని ఓ డ్యామ్ కూలిపోయింది. దీంతో వరద ఆ పట్టాణాన్ని ముంచెత్తింది. ఈ ఘటనలో 111 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన అధికారులు మోక్వా పట్టణంలో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
నైజీరియాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వరదలకు అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారంతా ప్రభుత్వ సహాయ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. భావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Also Read..
Elon Musk | వీడ్కోలు వేళ ముఖంపై గాయంతో మస్క్.. డ్రగ్స్ వినియోగించారా..? అంటూ విలేకరుల ప్రశ్న
Elon Musk | మస్క్‌కు ఘనంగా వీడ్కోలు.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్
Donald Trump | తలుపులు వేసి ఉన్నాయో లేదో చూసుకోవాలి.. మాక్రాన్ దంపతుల గొడవపై ట్రంప్ చమత్కారం