Elon Musk | అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk).. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుంది’ అంటూ రెండు రోజుల క్రితం ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే, డోజ్‌లో మస్క్‌ను నిన్న చివరి రోజు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump).. మస్క్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఓవెల్ ఆఫీస్‌కు వెళ్లిన మస్క్‌కు ట్రంప్ ఓ ప్రత్యేక బహుమతిని (special gift) కూడా ఇచ్చారు. బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇది దేశం తరఫున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రెస్ మీట్లో మస్క్ సేవలను ట్రంప్ అభినందించారు. తనకు అప్పగించిన బాధ్యతలను మస్క్ అవిశ్రాంతంగా నిర్వహించారని అన్నారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. తన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.
Also Read..
Donald Trump | తలుపులు వేసి ఉన్నాయో లేదో చూసుకోవాలి.. మాక్రాన్ దంపతుల గొడవపై ట్రంప్ చమత్కారం
Donald Trump | మస్క్ ఓ అద్భుతం.. ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు : డొనాల్డ్ ట్రంప్
Donald Trump | ‘అమ్మో’రికా.. వలస విధానాలపై ట్రంప్ కఠిన ఆంక్షలు