Donald Trump | వియత్నాం పర్యటనకు వెళ్లిన సందర్భంగా విమానం నుంచి దిగడానికి ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ (Emmanuel Macron)ను ఆయన భార్య బ్రిగిట్ మాక్రాన్ (Brigitte Macron) చెంపదెబ్బ కొట్టడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. అలాంటివి జరిగేటప్పుడు తలుపులు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.
డోజ్ శాఖ నుంచి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తప్పుకున్న నేపథ్యంలో ఓవెల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో సంభాషించారు. ఈ సందర్భంగా మాక్రాన్ దంపతులకు సంబంధించిన వైరల్ వీడియోపై స్పందించాలంటూ ఓ విలేకరు ట్రంప్‌ను కోరారు. దీనికి అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘ఈ విషయం గురించి నేను నేరుగా మాక్రాన్‌తో మాట్లాడాను. వారు బాగానే ఉన్నారు. వారిద్దరూ నిజంగా మంచి వ్యక్తులు.. నాకు బాగా తెలుసు’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రపంచ నాయకులకు ఓ సలహా కూడా ఇచ్చారు ట్రంప్. అలాంటివి జరిగినప్పుడు తలుపులు వేసి ఉన్నాయో లేదో ఓసారి చూసుకోవాలంటూ చమత్కరించారు. ట్రంప్ చమత్కారానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ట్రంప్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Teacher – Student Love | 47 ఏండ్ల మాక్రాన్.. 72 ఏండ్ల బ్రిగిట్.. టీచర్-స్టూడెంట్ లవ్ స్టోరీ
Emmanuel Macron | అధ్యక్షుడైతే నాకేంటి?.. ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించిన భార్య