France president : ఫ్రాన్స్ అధ్యక్షుడు (France President) ఇమ్మాన్యుయేల్ మాక్రన్ (Emmanuel Macron) ను ఆయన భార్య కొట్టినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది. అంతర్జాతీయంగా ఆ వీడియో పెద్ద చర్చకు దారి తీసింది. మాక్రన్‌ను అతడి భార్య బ్రిగిట్టే (Brigitte) ముఖంపై కొడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. భార్య కొట్టినా మాక్రాన్ ఏమి ఎరుగనట్టుగా మ్యాటర్‌ను కవర్ చేశాడనేది స్పష్టమవుతోంది.
కాగా మాక్రన్ దంపతులు నాలుగు రోజులు ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌కు చేరుకున్నారు. హనోయ్ విమానాశ్రయంలో మాక్రన్ ప్రత్యేక విమానం ల్యాండ్ అయ్యింది. విమానం ఎగ్జిట్ డోర్ తెరుచుకోగానే బయటికి వస్తున్న మాక్రన్‌ను అతడి భార్య బ్రిగెట్టే లోపలి నుంచే ముఖంపై కొడుతున్నట్టు కనిపించింది.
ఆ ఘటనతో మాక్రన్ క్షణకాలం షాకయినా వెంటనే తేరుకున్నారు. ముఖంపై నవ్వును పులుముకుని విమానం దిగుతూ కనిపించారు. ఆయన వెనుకే ఫ్లైట్ దిగుతున్న బ్రిగెట్టేకు పట్టుకోమన్నట్టుగా తన చేతిని అందించబోయాడు. కానీ బ్రిగెట్టే అతని చేతిని పట్టుకోవడానికి నిరాకరిస్తూ కోపంగా కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని ఇంటర్నెట్లో చర్చ జరుగుతోంది.
అయితే హనోయ్‌లో మీడియాతో మాట్లాడిన మాక్రన్.. ఆ ఘటనపై స్పందించారు. ఈ వీడియోలో దృశ్యాలు సీరియస్ గొడవకు సంబంధించినవి కావని, తాము సరదాగా గొడవపడ్డామని చెప్పారు. తాము ఎప్పుడూ ఇలాగే సరదాగా గొడవ పడుతూ ఉంటామని అన్నారు. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న సీరియస్‌నెస్‌ను చూస్తే మాత్రం మాక్రన్ అబద్దం చెబుతున్నాడనే విషయం స్పష్టమవుతోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Bizarre moment Emmanuel Macron is slapped by his wife Brigitte pic.twitter.com/kYsE5MCDV1
— The Sun (@TheSun) May 26, 2025