Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)పై గత కొంతకాలంగా డ్రగ్స్ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. మస్క్ తరచూ నిషేధిత డ్రగ్స్ (drugs) తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. అయితే, ఆ ఆరోపణలపై మస్క్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రోగన్‌తో కలిసి గతంలో ఓసారి డ్రగ్స్ సేవించిన విషయం నిజమేనని ఒప్పుకున్నారు. ఆ తర్వాత తాను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే, తాజాగా డోజ్ శాఖ నుంచి వైదొలగిన మస్క్.. ఓవెల్ ఆఫీస్‌లో జరిగిన వీడ్కోలు సమావేశంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ వినియోగంపై మస్క్‌కు ప్రశ్న ఎదురైంది.
వీడ్కోలు సమావేశానికి మస్క్ ముఖంపై గాయంతో వచ్చారు. అంతేకాదు ఆయన ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా అనిపించింది. అదే సమయంలో మస్క్ డ్రగ్స్ తీసుకున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఆయన క్రమం తప్పకుండా కెటామైన్, ఎక్స్టసీ, సైకెడెలిక్ తీసుకునేవారని పేర్కొంది. దీంతో వీడ్కోలు వేళ డ్రగ్స్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ విషయంపై తాజా మీటింగ్‌లో మస్క్‌కు ప్రశ్న ఎదురైంది. వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ను వినియోగించారా? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. అదంతా తప్పుడు కథనం అంటూ చెప్పుకొచ్చారు.
మస్క్‌కు ఘనంగా వీడ్కోలు..
అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk).. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుంది’ అంటూ రెండు రోజుల క్రితం ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే, డోజ్‌లో మస్క్‌ను నిన్న చివరి రోజు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump).. మస్క్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.
స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్
వీడ్కోలు సందర్భంగా ఓవెల్ ఆఫీస్‌కు వెళ్లిన మస్క్‌కు ట్రంప్ ఓ ప్రత్యేక బహుమతిని (special gift) ఇచ్చారు. బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇది దేశం తరఫున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రెస్ మీట్లో మస్క్ సేవలను ట్రంప్ అభినందించారు. తనకు అప్పగించిన బాధ్యతలను మస్క్ అవిశ్రాంతంగా నిర్వహించారని అన్నారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. తన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.
Also Read..
Donald Trump | తలుపులు వేసి ఉన్నాయో లేదో చూసుకోవాలి.. మాక్రాన్ దంపతుల గొడవపై ట్రంప్ చమత్కారం
Elon Musk | మస్క్‌కు ఘనంగా వీడ్కోలు.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్