Maoists bandh : మావోయిస్టుల (Maoists) అగ్రనేత నంబాల కేశవరావు (Nambala Krishna) మరో 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ (Encounter) కు నిరసనగా మావోయిస్టు కేంద్ర కమిటీ భారత్ బంద్ (Bharat Bandh) కు పిలుపునిచ్చింది. ఈ మేరకు అభయ పేరుతో ఒక లేఖను విడుదల చేసింది. నంబాల కేశవరావు మరో 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో ఈ నెల 21న భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (67) కూడా ఉన్నారు. బసవరాజు ఉన్నారన్న సమాచారంతోనే మాధ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టిముట్టి ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. ఈ ఎన్కౌంటర్కు నిరసనగా ఇప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది.