న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: అతడు ఓ బిచ్చగాడు. హర్యానాలోని అంబాలా నగరంలో హనుమాన్ గుడి దగ్గర భిక్షాటన చేసి పొట్ట నింపుకునేవాడు. ఒక ఆలయం వద్ద ఓ మూడు చక్రాల సైకిల్‌పై కూర్చుని యాచించేవాడు. ఈ నెల 9న అతడు అనారోగ్యంతో మరణించాడు. ఆ తర్వాత పోలీసులు ఆయన వస్తువులను పరిశీలించగా, ట్రై సైకిల్లోని పెట్టెలో రూ.50 వేల విలువైన నోట్ల కట్టలు దొరికాయి.
అతడి బ్యాంక్ ఖాతాలో రూ.3,32,000 నగదు ఉన్నట్టు పాస్‌బుక్ ద్వారా తెలిసింది. ఈ విషయం బయటపడ్డాక..స్థానికులు, పోలీసులు విస్తుపోయారు. మృతి చెందిన యాచకుడు లేఖరాజ్ పదేండ్లుగా భిక్షాటన చేశాడని పోలీసులు తెలిపారు. స్థానిక సామాజిక సంస్థ ‘వందేమాతరం దళ్’ ప్రతినిధులు అతడి అంత్యక్రియలు చేశారని పోలీసులు తెలిపారు.