ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 18:40:47

ఏపీలో కొత్త‌గా 753 క‌రోనా కేసులు

ఏపీలో కొత్త‌గా 753 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 753 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. మొత్తం 43,044 నమూనాలను పరీక్షించగా అందులో 753 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,54,764కు చేరింది. అదేవిధంగా గ‌త‌ 24 గంటల వ్యవధిలో కొత్త‌గా 13 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున‌.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకొక్క‌రు చొప్పున మరణించారు. దాంతో ఏపీలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 6,881కి చేరింది. ఇక కొత్త‌గా ఇవాళ‌ 1,507 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం మ‌రో 17,892 యాక్టివ్‌ కేసులన్నాయి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.