కరోనాతో మరో సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
సీనియర్ జర్నలిస్ట్| కరోనాతో మరో సీనియర్ జర్నలిస్ట్ తుదిశ్వాస విడిచారు. పశ్చిమబెంగాల్లో ప్రముఖ టీవీ యాంకర్లలో ఒకరైన అంజన్ బందోపాధ్యాయ్ కరోనాతో కన్నుమూశారు.

కోల్‌కతా: కరోనాతో మరో సీనియర్ జర్నలిస్ట్ తుదిశ్వాస విడిచారు. పశ్చిమబెంగాల్లో ప్రముఖ టీవీ యాంకర్లలో ఒకరైన అంజన్ బందోపాధ్యాయ్ కరోనాతో కన్నుమూశారు. గత నెల 14న కరోనా బారినపడిన ఆయన దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం వైరస్ నుంచి కోలుకున్న ఆయన డిశ్చార్జీ అయ్యారు. అయితే మళ్లీ కరోనా సంబంధిత సమస్యలు తిరగబెట్టడంతో మరోమారు దవాఖానలో చేరారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటీలేటర్‌పై ఉంచారు. అయితే నెలరోజుల పాటు మహమ్మారితో పోరాడిన ఆయన ఆదివారం రాత్రి 9.25 గంటలకు మృతిచెందారు.
జర్నలిజంలో 33 ఏండ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన బందోపాధ్యాయ్.. జీ 24 గంటలు బెంగాలీ చానల్‌కు ఎడిటర్‌గా వ్యవహరించారు. అనంతరం అటునుంచి ఆనంద్ బజార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈమధ్యే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన టీవీ 9 బెంగాల్ న్యూస్ చానల్లో చేరారు. ఆ చానల్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా బారినపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
చెడు వ్యసనాలు.. స్నేహితున్ని హత్యచేసిన టీనేజర్లు
గుడ్ న్యూస్.. ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీ
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా
గుజరాత్లో భూకంపం
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

