పల్లెపై పర్యవేక్షణ
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే కేసుల గుర్తింపు, చికిత్స
- హోం ఐసొలేషన్ లేనివారి కోసం 30 పడకల కొవిడ్ సెంటర్
- కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను ఎల్లప్పుడూ కొనసాగించాలి
- గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, మే 16: సెకండ్ వేవ్‌లో గ్రామాలకు కూడా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో కొవిడ్ నియంత్రణ, నిర్వహణపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసింది. తేలికపాటి లక్షణాలు ఉండి హోం-ఐసోలేషన్ సదుపాయాలు లేనివారు లేదా వైరస్ లక్షణాలు లేకుండా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం కనీసం 30 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. అంటువ్యాధుల నివారణలో పాటించినట్లే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని పేర్కొంది.
ఎవరికి ఎక్కడ చికిత్స అంటే?
రోగుల వ్యాధి తీవ్రతను బట్టి గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలను మూడు రకాలుగా విభజించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
తేలికపాటి లేదా లక్షణాలు లేనివారికి కొవిడ్ కేర్ సెంటర్లలో (సీసీసీ) చికిత్స అందించాలి. దవాఖాన సమీపంలోని పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, పంచాయత్ భవనాలు, మ్యారేజ్ హాల్స్‌లో సీసీసీలను ఏర్పాటు చేయాలి. అంబులెన్స్ సర్వీస్, 24X7 ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఉండేలా చూసుకోవాలి.
మధ్యస్థ లక్షణాలు ఉన్న వారికి డెడికేటెడ్ కొవిడ్ హెల్త్ సెంటర్ (డీసీహెచ్‌సీ)లో చికిత్సనివ్వాలి.
తీవ్రమైన కేసులను డెడికేటెడ్ కొవిడ్ హాస్పిటల్ (డీసీహెచ్)లో చేర్చాలి.
కిట్‌లో ఏమేమి ఉండాలంటే?
ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్న వారికి విధిగా హోం ఐసోలేషన్ కిట్‌ను సరఫరా చేయాలని కేంద్రం సూచించింది. ఈ కిట్‌లో పారాసిటమాల్ 500 ఎంజీ, ఐవర్‌మెక్టిన్ ట్యాబ్లెట్లు, దగ్గు మందు, మల్టీ విటమిన్లు, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందుల వాడకం వివరాలు, రోగుల పర్యవేక్షణ తదితర అంశాలను వివరించే సమగ్ర కరపత్రికను ఉంచాలి. వ్యాధి తీవ్రత ఎక్కువైతే వైద్య సాయం కోసం సంప్రదించాల్సిన సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచాలి.
కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇవే..
- గ్రామాల్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లలో కొవిడ్ పరీక్షలను నిర్వహించాలి. దీని కోసం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ (ర్యాట్) కిట్లు అందుబాటులో ఉంచాలి. దీనిపై ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణనివ్వాలి.
- పాజిటివ్, అనుమానిత కేసులను చేర్చుకోవడానికి కొవిడ్ కేర్ సెంటర్లలో వేర్వేరు బ్లాక్‌లను ఏర్పాటు చేయాలి. వీరికి కలిపి ఒకేదగ్గర చికిత్స అందించొద్దు.
- అంటువ్యాధుల నివారణలో పాటించినట్లే ఆశా కార్యకర్తల సాయంతో ప్రతి గ్రామంలో పటిష్ట నిఘా, పర్యవేక్షణ కొనసాగించాలి. రోగుల గుర్తింపు, కాంటాక్ట్ ట్రేసింగ్ను ఎప్పుడూ నిర్వహించాలి.
- తేలికపాటి లక్షణాలు ఉన్న పాజిటివ్ కేసుల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహ్ఎచ్వో) సాయంతో టెలి-మెడిసన్ సేవలు అందించొచ్చు.
- ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్న కొవిడ్ రోగులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలున్న పాజిటివ్‌గా తేలిన వారిని దవాఖానకు తరలించాలి.
- అనుమానిత కేసులకు యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలి. లేదా సమీప ల్యాబ్‌లకు నమూనాలను పంపాలి.
- కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ స్థాయిల నిర్ధారణ అతిముఖ్యం. ప్రతి గ్రామంలో తగినన్ని పల్స్ ఆక్సిమీటర్లను, థర్మామీటర్లను అందుబాటులో ఉంచాలి. వాడిన ప్రతిసారి వాటిని శానిటైజ్ చేయాలి.
- పాజిటివ్‌గా గుర్తించి హోంఐసోలేషన్లో ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుటు చూసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్లు, థర్మామీటర్లను లోన్ బేసిస్‌లో సరఫరా చేయాలి.
- హోంఐసోలేషన్, క్వారంటైన్లో ఉన్న రోగుల సమాచారాన్ని ఇంటింటి సర్వే సాయంతో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దీని కోసం ఫ్రంట్‌లైన్ వర్కర్లు/వలంటీర్లు/టీచర్ల సాయం తీసుకోవచ్చు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

