భువనేశ్వర్: అడవి నుంచి తప్పిపోయి జనావాసాల్లోకి వచ్చిన ఓ ఏనుగుపిల్ల 15 అడుగుల లోతున్న పాడుబడ్డ బావిలో పడింది. దాంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని గున్న ఏనుగును రక్షించారు. బావికి పక్కనుంచి ఏటవాలుగా క్రేన్ల సాయంతో గొయ్యి తవ్వి, కింది భాగంలో ఒక రంధ్రం చేశారు. ఆ రంధ్రం ద్వారా గున్న ఏనుగు ముందు కాళ్లకు తాళ్లను బిగించి క్రేన్ ద్వారా బయటికి లాగారు. ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గున్న ఏనుగు రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | An elephant calf was rescued from a 15-feet deep well at a village in Mayurbhanj district of Odisha on Saturday.
— ANI (@ANI) April 10, 2021
"The calf fell into the well while it was roaming in the area on Friday night," said Rabi Narayan Mohanty, Range Officer, Deuli Forest Range. pic.twitter.com/TPIrWN52Ti
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
అది ఒక హత్యాకాండ.. కూచ్‌బిహార్ కాల్పులపై మమతాబెనర్జి
72 గంటల్లో 12 మంది ఉగ్రవాదులు హతం..!
దేశంలో 10 కోట్ల మార్కు దాటిన కొవిడ్ వ్యాక్సినేషన్: కేంద్రం
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.53లక్షల కేసులు