Air India flight U-turn over China | కెనడా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం.. చైనా గగనతలంలో యూటర్న్
Air India flight U-turn over China | కెనడాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి మళ్లింది. నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత చైనా గగనతలంలో యూటర్న్ తీసుకున్నది. సుమారు ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
న్యూఢిల్లీ: కెనడాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి మళ్లింది. నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత చైనా గగనతలంలో యూటర్న్ తీసుకున్నది. సుమారు ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. (Air India flight U-turn over China) కెనడాలోకి ప్రవేశించడానికి అనుమతి లేని విమానాన్ని ఎయిర్ ఇండియా పొరపాటున నడపడటంతో ఈ సంఘటన జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ185 విమానం మార్చి 19న ఉదయం 11:34 గంటలకు ప్రయాణికులతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. కెనాడాలోని వాంకోవర్ చేరుకునేందుకు తూర్పు మార్గంలో ప్రయాణించింది.
కాగా, సుమారు నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత చెనా గగనతలంలోని కున్మింగ్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం యూ టర్న్ తీసుకున్నది. మరో నాలుగు గంటలు తిరిగి వెనక్కి ప్రయాణించింది. మొత్తం 7 గంటల 54 నిమిషాల ప్రయాణం తర్వాత గురువారం రాత్రి 7.19 గంటలకు బయలుదేరిన ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత అందులోని ప్రయాణికులు, విమాన సిబ్బంది దిగిపోయారు.
మరోవైపు ప్రస్తుతం కెనడా సర్వీసుల కోసం కేవలం బోయింగ్ 777-300ఈఆర్ విమానాలను మాత్రమే నడపడానికి ఎయిర్ ఇండియాకు అనుమతి ఉన్నది. అయితే మార్చి 19న కెనడాకు ప్రయాణం కోసం బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానాన్ని ఎయిర్ ఇండియా వినియోగించింది. సుమారు నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఈ పొరపాటును గుర్తించింది. దీంతో ఆ విమానం వెనక్కి వచ్చింది.
కాగా, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. వారికి వసతి కల్పించినట్లు తెలిపింది. శుక్రవారం ఉదయం వాంకోవర్‌కు బయలుదేరినట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది.
అయితే ఈ పొరపాటు వల్ల ఆ విమానం ఎనిమిది గంటలు ప్రయాణించడంతో గంటకు ఎనిమిది నుంచి తొమ్మిది టన్నుల ఇంధనం వినియోగమైనట్లు తెలుస్తున్నది. ఈ ఖర్చుతో పాటు ప్రయాణికులకు వసతి వ్యయాల ప్రభావం ఆ సంస్థపై గణనీయంగా ఉంటుందని అంచనా.
Also Read:
Veterinarian Dies in Hippo Attack | ఆరోగ్య పరీక్షల సమయంలో నీటి గుర్రం దాడి.. పశువైద్యురాలు మృతి
Watch: 18 మంది నిందితులను పబ్లిక్‌గా చితకబాదిన పోలీసులు.. ఎందుకంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

