న్యూఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానంలో (Air India Plane Crash) ప్రమాదానికి ముందు ఎలాంటి సమస్యలు లేవని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ విమానం పారిస్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మధ్య ప్రయాణించినట్లు పేర్కొంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం తొలిసారి మీడియా సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా ఇందులో పాల్గొన్నారు.
కాగా, గురువారం లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మెడికల్ హాస్టల్ భవనంపైకి కూలిపోయిందని పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపారు. 650 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత విమానం ఎత్తు తగ్గడం ప్రారంభమైందని చెప్పారు. జూన్ 12న మధ్యాహ్నం 1:39 గంటలకు పైలట్ ఏటీసీకి మేడే కాల్ చేశారని వివరించారు.
మరోవైపు ఆ విమానాన్ని సంప్రదించడానికి ఏటీసీ ప్రయత్నించగా ఎలాంటి స్పందన రాలేదని సమీర్ కుమార్ సిన్హా తెలిపారు. ‘టేకాఫ్ అయిన సరిగ్గా ఒక నిమిషం తర్వాత విమానాశ్రయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘని నగర్లో విమానం కూలిపోయింది’ అని అన్నారు. విమాన ప్రమాదంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో సహా 241 మందితోపాటు ప్రమాదం జరిగిన ఆ ప్రాంతంలోని పలువురితో సహా సుమారు 270 మంది ఈ ప్రమాదంలో మరణించారు.
VIDEO | Civil Aviation Ministry’s press briefing in Ahmedabad plane crash:
“After reaching at a height of 650 feet, the aircraft started to lose height. The pilot gave Mayday call to the ATC at PM (June 12). As per the ATC, when it tried to contact the aircraft then there was… pic.twitter.com/yEo1aGcdHH
— Press Trust of India (@PTI_News) June 14, 2025
Also Read:
ఎంటెక్ చదివేందుకు లండన్ వెళ్తున్న ఆటో డ్రైవర్ కూతురు.. విమాన ప్రమాదంలో మృతి
లండన్ టికెట్‌ను రెండుసార్లు రద్దు చేసుకున్న విజయ్ రూపానీ