అహ్మదాబాద్: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ (Vijay Rupani) ఈ ప్రయాణానికి ముందు రెండుసార్లు లండన్ టికెట్‌ను రద్దు చేసుకున్నారు. లండన్‌లో ఉన్న భార్య, కుమార్తెను కలిసేందుకు తొలుత మే 19న ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. జూన్ 25న భారత్‌కు తిరిగి రావాలని భావించారు. అయితే ఆ ప్లాన్‌లో మార్పు వల్ల మే 19న లండన్ వెళ్లాల్సిన విమాన టికెట్‌ను రద్దు చేసుకుకున్నారు. జూన్ 5న ప్రయాణించాలని నిర్ణయించి ఆ తేదీకి విమాన టికెట్ బుక్ చేసుకున్నారు.
కాగా, విజయ్ రూపానీ మళ్లీ తన ట్రావెల్ ప్లాన్ మార్చుకున్నారు. జూన్ 5న బుక్ చేసిన విమాన టికెట్‌ను రెండోసారి రద్దు చేసుకున్నారు. జూన్ 12న ప్రయాణించేందుకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171లోని సీటు నంబర్ 2డీని బుక్ చేసుకున్నారు. అయితే గురువారం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఒక నిమిషంలోపే ఆ విమానం ఎత్తు కోల్పోయింది. మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్‌పై కూలి పేలిపోయింది.
మరోవైపు ఈ ప్రమాదంలో విజయ్ రూపానీతో సహా ఆ విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితోపాటు 33 మంది ఇతర వ్యక్తులతో సహా మొత్తం 274 మంది మరణించారు. అదృష్టవశాత్తు బ్రిటన్ పౌరుడైన రమేష్ విశ్వాస్ అనే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read:
విజయ్ రూపానీకి నివాళి.. రాజ్‌కోట్‌లో మార్కెట్లు బంద్..Video
నేడు రమేష్ విశ్వాస్.. నాడు థాయ్ యాక్టర్.. ప్రాణాలు నిలిపిన 11A సీటు..!
ప్రమాదం జరిగిన రోజు ఎయిర్ ఇండియా ఫైట్‌లో లండన్‌కు మంచు లక్ష్మి.. పోస్ట్ వైరల్