Vijay Rupani : అహ్మదాబాద్ (Ahmedabad) లో ఎయిరిండియా (Airindia) విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ (Vijay Rupani) కి రాజ్‌కోట్ (Rajkot) లోని వ్యాపారులు నివాళులు అర్పించారు. ఆయన మృతికి సంతాపంగా ఇవాళ రాజ్‌కోట్‌లోని మార్కెట్లు (Markets) అన్నింటిని బంద్ చేశారు.
రాజ్‌కోట్ ప్రజలను విజయ్ రూపానీ ఎంతో ప్రేమగా చూసుకునేవారని, ఎప్పుడూ ప్రజలతో మమేకమయ్యేవారని స్థానికుడు నవనీత్ గుర్తుచేసుకున్నారు. రాజ్‌కోట్‌లో ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. రూపానీ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ప్రమాదాన్ని రాజ్‌కోట్ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు.
కాగా గత గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో విమానంలో ఉన్నవారు 241 మంది కాగా, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్నవాళ్లు 33 మంది. మరణించిన 241 మంది విమాన ప్రయాణికుల్లో విజయ్ రూపానీ కూడా ఒకరు.
#WATCH | Rajkot, Gujarat: In tribute to former Gujarat CM and BJP leader Vijay Rupani, who passed away in the Air India Flight AI 171 crash in Ahmedabad on 12 June, markets in Rajkot are closed for half a day.
A local Navneet says, “This is such an accident that the people of… pic.twitter.com/7NUWpOz8SF
— ANI (@ANI) June 14, 2025