PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కెనడా పర్యటనలో ఎలాంటి మార్పూ లేదని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. కెనడా (Canada)లో రేపటి నుంచి మూడు రోజుల పాటు జీ7 శిఖరాగ్ర సదస్సు (G7 summit) జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 15 నుంచి 17 వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీకి కెనడా నుంచి గతవారం ఆహ్వానం అందించింది. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney).. మోదీకి ఫోన్ చేసి సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే, భారత్-కెనడా మధ్య నెలకొన్న విభేదాల కారణంగా జీ 7 సమ్మిట్‌కు ప్రధాని మోదీ దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
ప్రధాని కెడనా పర్యటనలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశాయి. సదస్సులో పాల్గొనాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. ఈ సదస్సు కోసం ప్రధాని రేపు ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్తారని తెలిపాయి. కాగా, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ పరిణామాల నేపథ్యంలో జీ7 సదస్సు కీలకంగా మారింది. ఈ సదస్సులో ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంపై ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చర్చల ద్వారా ప్రస్తుత వివాదానికి పరిష్కారం చూపాలని మోదీ కోరనున్నట్లు సమాచారం. అంతేకాదు ఇటీవలే పాక్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కూడా ప్రపంచ నాయకులతో ప్రధాని చర్చించనున్నట్లు తెలిసింది.
జీ7 అంటే ?
అత్యంత అధునాతన, పారిశ్రామికీకరణ చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఏడు దేశాల కూటమి. అమెరికా కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్యదేశాలు. జీ7 అనే పేరు సభ్య దేశాల సంఖ్యని సూచిస్తుంది. ఇందులో భారత్ సభ్యదేశం కాకపోయినా.. ఏటా ఈ సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందుతోంది.
Also Read..
Plane Crash | విమాన ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ
Manchu Lakshmi | ప్రమాదం జరిగిన రోజు ఎయిర్ ఇండియా ఫైట్‌లో లండన్‌కు మంచు లక్ష్మి.. పోస్ట్ వైరల్
NEET UG Results | నేడే నీట్ యూజీ ఫలితాలు.. ఏ క్షణ్నానైనా ప్రకటించే ఛాన్స్!