Plane Crash | విమాన ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ
Plane Crash | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా (Air India) డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని (high level committee) ఏర్పాటు చేయనుంది.
Plane Crash | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా (Air India) డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని (high level committee) ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ శనివారం వెల్లడించింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ కమిటీ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అంచనా వేయనుంది. అంతేకాదు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, భద్రతా మార్గదర్శకాలను కూడా తనిఖీ చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఓ కఠినమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది. అయితే, ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని.. ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
బ్లాక్‌బాక్స్ లభ్యం
ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాద స్థలంలో రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ భవనం పైకప్పు మీద విమాన శకలాలలో బ్లాక్‌బాక్స్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా విమానం తోక భాగంలో బ్లాక్‌బాక్స్‌ను అమర్చుతారు. ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటల తట్టుకునేలా, 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్నా ధ్వంసం కాకుండా వీటిని రూపొందిస్తారు.
ఇందులో విమానానికి సంబంధించిన ఫ్లైట్ డాటా రికార్డర్(ఎఫ్డ్ఆర్) వంటి సాంకేతిక సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్) సంభాషణల సారాంశం నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో విమానంలోని ఇద్దరు పైలట్ల మాటలు రికార్డవుతాయి. ప్రమాదానికి ముందు వారు ఏం మాట్లాడుకున్నారనేది తెలిస్తే దర్యాప్తు సులభమవుతుంది. బ్లాక్‌బాక్స్ పక్కనే డీవీఆర్లు ఉంటాయి. విమానంలోని సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డయిన దృశ్యాలు ఇందులో ఉంటాయి. బ్లాక్‌బాక్స్, డీవీఆర్‌లోని డాటాని ఫోరెన్సిక్ బృందాలు విశ్లేషిస్తాయి. ఇందులోని సమాచార వివరాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా నిలుస్తాయి.
274కు చేరిన మృతుల సంఖ్య
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు (Air India Plane Crash) చెందిన డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్‌పై కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్పుడు 274కు చేరిందని తెలిపారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. ఇతరులు 33 మంది ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనలో విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read..
Air India Plane Crash | ఎయిర్ఇండియా విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతుల సంఖ్య
భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి!.. దుర్మరణం
లక్కీ నంబర్ 1206.. మరణం 12/06.. విజయ్ రూపానీకి కలిసిరాని లక్కీ నంబర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

