న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన దుర్ఘటనలో మృతి చెందిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ కూడా అదృష్ట సంఖ్యను నమ్ముతారు. 1206ను ఆయన తన లక్కీ నంబర్‌గా విశ్వసిస్తారు. ఆయన బైక్, కారు.. ఇలా వాహనమేదైనా ఆ నంబర్ ఉండాల్సిందే. ఆ సంఖ్య అంటే ఆయనకు అంత ఇష్టం. అయితే, కాకతాళీయమే అయినా అదే సంఖ్య ఆయన ఆయువును బలిగొన్నది. విమాన ప్రమాదం జూన్ 12న జరిగింది. అంటే.. 12/06. నిజానికి అది ఆయన లక్కీ నంబర్.
కానీ, అదే రోజు ఆయన విమాన ప్రమాదంలో మరణించడం అందరినీ కలచివేసింది. పంజాబ్ బీజేపీ ఇన్చార్జిగా ఉన్న విజయ్ రూపానీ లండన్‌లో ఉన్న తన భార్య, కుమార్తెను కలిసేందుకు ఎయిరిండియా విమానమెక్కారు. నిజానికి ఆయన ఈ నెల 5 నుంచి 12 మధ్య లండన్‌లో పర్యటించాల్సి ఉన్నది. అయితే, లూధియానా వెస్ట్ ఉప ఎన్నిక కారణంగా దానిని వాయిదా వేసుకుని 12న ఆయన విమానమెక్కారు.